ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీఫ్ ధన్కర్ను ఎంపిక చేయడం ఎవరూ ఊహించనిది. బహుశా మోదీ, అమిత్ షా తప్ప చివరి క్షణం వరకూ ధనకర్కూ తెలిసి ఉండదు. వారు ఎంపిక చేశారు కానీ ఆయన ఉపరాష్ట్రపతి అయిపోతున్నారు. అయితే అసలు ఏ సమీకణం కింద ఉపరాష్ట్రపతిని ఎంపిక చేశారన్నది రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు.
నిజానికి ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ముస్లిందేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ కారణంగా ఉపరాష్ట్రపతిగా ఈ సారి ఆ వర్గానికి ఖాయమని అనుకున్నారు. ఆ మేరకు ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించారు. దీంతో ఆయనకే పదవి అనుకున్నారు. కానీ ఆయనకు పదవి ఊడగొట్టారు కానీ.. ఉపరాష్ట్రపతి ఇవ్వలేదు. ఇలాగే ఇతర పేర్లూ వెనుకబడిపోయాయి. నిజానికి ముస్లిం వర్గాలను సంతృప్తి పరచాలని బీజేపీ ఎప్పుడూ అనుకోలేదు. అనుకోదు కూడా. ఇక్కడే విశ్లేషకులు తప్పటడుగు వేశారు.
తర్వాత దక్షిణాది సెంటిమెంట్‌ను బీజేపీ పరిశీలిస్తుందని అనుకున్నారు. అయితే వెంకయ్యనాయుడుని కొనసాగించడమో లేకపోతే తమిళిసైకో.. మరొకరికో దక్షిణాది వారికే ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఆ సెంటిమెంట్‌ను కూడా పట్టించుకోలేదు. ఇక సీనియర్ నేతలు… ఇతర సమీకరణాల్ని చాలా లెక్కలేశారు. కానీ అవన్నీ తమ లెక్కలోకి రావని ధనకర్ ఎంపిక ద్వారా మోదీ, షా నిరూపించినట్లయింది. వారి లెక్కేమిటో వారిే తెలుసు. ఇంకెవరికీ తెలిసే చాన్స్ లేదు.
అయితే ధనకర్ మాత్రం బెంగాల్ గవర్నర్‌గా మమతా బెనర్జీని కాదని సమాంతర పాలనచేసి దేశం దృష్టిని ఆకర్షించారు. రెండో సారి గెలిచినా మమతకు మనశ్శాంతి లేకుండా చేయడంలో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు ఆయనకు ప్రతిఫలం లభించిందని బీజేపీ వర్గాలు సెటైర్లు వేసుకుంటున్నాయి.