రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేయించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు తమ ప్లాన్లను మీడియాకు లీక్ చేశారు. కనీసం పది ఓట్లు అయినా క్రాస్ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా విపక్ష పార్టీల అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాకే మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి పడతాయి. ఇతర ఓట్లు పడే చాన్స్ లేదు. ఎంపీలు పార్లమెంట్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు.
అయితే అటు టీఆర్ఎస్ కానీ.. ఇటు కాంగ్రెస్ నుంచి కానీ తమతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ముకు ఓట్లు వేయించాలని ప్రయత్నించార. పలువురితో సంప్రదింపులు జరిపామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే వారి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయో లేదో ఎవరికీ తెలియదు. ఇరవై ఒకటో తేదీన ఓట్ల లెక్కింపు తర్వాతనే అసలు విషయం తెలుస్తుంది. నిజానికి బీజేపీ నేతలు ఇలా ప్రచారం చేసుకోవాల్సిన అవసరంలేదని క్రాస్ ఓటింగ్ జరిగితే లెక్కింపులో తెలిసిపోతుందని అంటున్నారు.
అయితే ఇప్పటి వరకూ క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగాఎక్కడా అనుమానం రాలేదు. సీతక్క మాత్రం పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికిఓటు వేయడంతో మళ్లీ మార్చుకున్నారు. రెండో బ్యాలెట్ పేపర్ అడిగినా అధికారులు ఇవ్వలేదు. దాంతో ఆమె ఓటు చెల్లుతుందా లేదా అన్నది లెక్కింపులో నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క ఓటు తప్ప.. ఇంకేమీ క్రాస్ ఓటింగ్ జరిగే చాన్స్ లేదని భావిస్తున్నారు.