మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, బాయ్ కాట్ చైనా ఇవన్నీ నినాదాలుగానే మిగిలిపోయాయి. చివరికి జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చేసింది. హర్ ఘర్ తిరంగా పేరుతో కేంద్రం .. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో అందర్నీ భాగం చేయాలనుకుంటోంది. ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ కార్యక్రమం వెనుక .. ముందు ఏమున్నాయన్న విశ్లేషణలు పక్కన పెడితే .. ఇంటికొక జెండా ఇప్పుడు అవసరం.
ఆగస్టులో ఏడో తేదీ నుచి వారం పాటు నిర్వహిస్తారు కాబట్టి.. ఇప్పుడు అవసరానికి తగ్గట్లుగా జెండాలు తయారు చేసుకునే సామర్థ్యం భారత తయారీ రంగానికి ఉంటుంది. కానీ కేంద్రం అనూహ్యంగా …చైనా నుంచి బల్క్‌గా సిల్క్ జాతీయ జెండాలను దిగుమతి చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చేసింది. పెద్దగా ప్రచారంలోకి రాని ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చాలా మంది మోదీ ప్రభుత్వ దేశభక్తిని ఇలా మేడి పండు చందంగా ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు.
ప్రతి ఇంటిపైనా జెండా ఎగురుతుంది కానీ అది మేడ్ ఇన్ చైనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్షాలు కూడా అదే అంటున్నాయి. తక్షణం ఆ అనుమతి ఉత్తర్వులు వెనక్కి తీసుకుని.. ఇప్పటి వరకూ ఇచ్చిన నినాదాలకు పని కల్పించాలని అంటున్నారు. అయితే కేంద్రం వినిపించుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే దేశభక్తిని గుండెల నిండా చైనా జెండాలతో నింపాలనుకుంటున్నారు.