చిరంజీవి రాజకీయాల్లో చిల్లర బేరగాడు అంటూ సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలపై జనసైనికులు.. మెగా ప్యాన్స్ మండి పడుతున్నారు. దూకుడుగా మాట్లాడటంలో తనదైన ట్రేడ్ మార్క్ ఉన్న సీపీఐ నారాయణకు చిరంజీవిపై కోపం వచ్చింది. దానికి కారణం మోదీతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరకు హాజరు కావడమే. అసలు పిలిచినందుకు కూడా ఆయన ఫీలయ్యారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. ఈ మాటలు సహజంగానే మెగా ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురి చేశారు. ఉదయం నుంచి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకున్నారు. సాయంత్రానికి నాగబాబు కూడా ట్వీట్ చేశారు.
సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు.. అతనితో గడ్డి తినడం మాన్పించి…కాస్త అన్నం పెట్టండి … అని సలహా ఇచ్చారు. నాగబాబు ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. సీపీఐ నారాయణ ఇతరులపై ఇలాంటి వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు. అయితే నారాయణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించే అవకాశం లేదు. ఆయన రాజకీయ విమర్శలను పట్టించుకోవడం మానేశారు.