‘పుష్ప’ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఇప్పుడు ”పుష్ప ది రూల్’ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సెకండ్ పార్ట్ తో కథకి ఒక ముగింపు పలుకుతారని అంతా అనుకున్నారు. ఐతే ఇప్పుడు పుష్ప పై మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి పార్ట్ 3 కూడా వుండే అవకాశం వుందని ఫహద్ ఫాజిల్ చెప్పడం ఇప్పుడు టాపిక్ గా మారింది.
‘సుకుమార్ ‘పుష్ప’ కథ ఒక పార్ట్ గా చెప్పాలనుకున్నారు. నాకు స్క్రిప్టు వినిపించినప్పుడూ ఒకటే అన్నారు. ఐతే రెండు భాగాలుగా మారింది. ‘పుష్ప 3’కీ కావాల్సినంత మెటీరియల్ ఆయన దగ్గర ఉంది’’ అని ఫహద్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం ఆసక్తికరంగా వుంది. నిజానికి సుకుమార్ కి పుష్ప సిరిస్ ని అలా కొనసాగించాలానే వుంది. నార్కొస్ వెబ్ సిరిస్ టైపులో నడిపించాలని వుంది. ఈ విషయాన్ని గతంలోనే చెప్పారు. అయితే అంత కంటెంట్ ని సినిమాలు గా చూపిస్తారా ? లేదా వెబ్ సిరిస్ మార్గాన్ని ఎంచుకుంటారా? అనేది ఇంకా నిర్ణయించలేదు. పుష్ప 2కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సుకుమార్ నిర్ణయం వుండే అవకాశం వుంది.