విరామం లేకుండా వారాంతాల్లో అయినా ప్రజల వద్దకు వెళ్దామనుకుంటున్న పవన్ కల్యాణ్‌కు ఆటంకాలు తప్పడం లేదు. వరుసగా మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకోగానే ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చేసింది. దీంతో వచ్చే ఆదివారం అంటే 24న జనవాణి రద్దు చేస్తున్నట్లుగా 20వ తేదీన నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మళ్లీ నెలాఖరు రోజున అంటే 31వ తేదీన ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందని ఎక్కడ జరుగుతుందన్నదానిపై తర్వాత ప్రకటన చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ప్రజలతో మేమేకం అయ్యేందుకు పవన్ కల్యాణ్ రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు నిర్వహించే రైతు భరోసా యాత్ర కాగా.. మరొకటి.. ప్రజల సమస్యలను ఆర్జీల రూపంలో స్వీకరించే జనవాణి. వరుసగా జిల్లాలు తిరుగుతూ కార్యక్రర్తల్లో పవన్ కల్యాణ్ ఉత్సాహం నింపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు వైరల్ ఫీవర్ రావడంతో ఓ వారం గ్యాప్ వస్తోంది.
ఇప్పటికి రెండు వారాలు విజయవాడలో.. ఓ వారం తూ.గో జిల్లాలో జరిగింది. అందుకే ఈ సారి ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాల్లో నిర్వహించనున్నారు.రైతు భరోసా యాత్రను ఇంకా పలు జిల్లాల్లో కొనసాగించాల్సి ఉంది. దసరా నుంచి బస్ యాత్ర ప్రారంబిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. సినిమా షూటింగ్‌లను కూడా దసరాలోపు పూర్తి చేసుకుని .. ప్రారంభం కాని సినిమాలను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.