ఏపీ హైకోర్టుకో మరో ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు ఏడుగు పేర్లను రాష్ట్రపతికి సిఫారసు చేసింది. వీరంతా ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్నారు. అంటే జిల్లా జడ్జిలు సహా న్యాయవ్యవస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న వారు. సుప్రీంకోర్టు సిఫారసు చేసిన వారిలో వెంకట రవీంద్రబాబు, రాధాకృష్ణ కృప సాగర్, శ్యామ్‌సుందర్, శ్రీనివాస్ ఊటుకురు, బోపన్న వరహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, మల్లికార్జునరావు, వెంకటరమణ పేర్లను హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఏపీ హైకోర్టుకు గత ఫిబ్రవరి నెలలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు. కె. శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌రావు, ఎస్ సుబ్బారెడ్డి, సి. రవి, వి. సుజాతలను నియమించారు. ఇటీవల కొంత మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు కొత్తగా ఏడుగుర్ని నియమించనుండటంతో న్యాయమూర్తుల సంఖ్య పెరగనుంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. న్యాయమూర్తుల కొరత కారణంగా వేలాది కేసులు పెండింగ్‌లో ఉండటంతో పెద్ద ఎత్తున దేశంలోని అన్ని హైకోర్టులకు విస్తృతంగా న్యాయమూర్తులను నియమించే ప్రక్రియ చేపట్టారు. సుప్రీంకోర్టులోనూ గతంలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండేవి. సీజేఐ చొరవతో దాదాపుగా అన్ని ఖాళీలు భర్తీ అయ్యాయి.