రాజకీయం అంటే అంతే. గోవాలో సిల్లీ సౌల్స్ అనే బార్ అండ్ రెస్టారెంట్‌ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్ జోయిష్ ఇరానీ నడిపిస్తున్నారని.. అది నకిలీ లైసెన్స్‌లో నడిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఆ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఉంది. రెండు నెలల కిందట రెన్యూవల్ చేశారు. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఆరు నెలల కిందట ఆ వ్యక్తి చనిపోయాడు. డెత్ సర్టిఫికెట్తో సహా ఓ లాయర్ ఈ అంశాన్ని బయటకు తీసుకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ఇప్పుడు ఆ రెస్టారెంట్ యజమానులు ఎవరనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఆరు నెలల కిందటే చనిపోయిన వ్యక్తి రెండు నెలల కిందట సంతకం పెట్టి లైసెన్స్ రెన్యూవల్ చేసుకున్నారని రికార్డుల్లో ఉంది. అంటే చనిపోయిన వ్యక్తి కాదు.. పెద్ద ఫ్రాడే జరుగుతోందని తెలుస్తోంది. ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కుమార్తెదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గోవాలో ప్రపంచ స్థాయి రెస్టారెంట్ అనుభవాన్ని ఇవ్వడానికి గోవాలో ఈ రెస్టారెంట్‌ను ఆమె చేసిన ప్రకటనలు వైరల్ అవుతున్నాయి. ఆమెదే ఆ రెస్టారెంట్ అని.. బినామీల పేర్ల మీద నడిపిస్తున్నారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.
అయితే స్మృతి ఇరానీ మాత్రం దీన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిదేళ్ల తన కుమార్తె.. ఇంకా చదువుకుంటోందని ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. రాహుల్‌పై తనపై మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అదే సమయంలో ఆమె లాయర్ .. జోయిష్ ఇరానీకి వ్యాపారాలు లేవని.. ఆమె చెఫ్ కోర్సులు చేస్తున్నారని.., పలు హోటళ్లలో అతిధి చెఫ్‌గా పని చేస్తూంటారని వివరణ ఇచ్చారు. అయితే ఆ బార్ అండ్ రెస్టారెంట్ .. బినామీ పేర్ల మీద నడిపిస్తోంది ఇరానీ కుమార్తెనని.. రాజకీయ వర్గాలు బలంగా ఆరోపిస్తున్నాయి.