‘లైగర్’… ఈ సినిమాతో ఇండియాని షేక్ చేసేస్తా – అంటూ ముందే స్టేట్మెంట్ ఇచ్చి బిగ్ ఫైట్‌కి సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. పూరి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 25న లైగర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌తో… ప్రమోషన్లకు చిత్రబృందం శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని థియేటర్లో బ్లాస్ట్ చేయాలన్నది పూరి ఉద్దేశ్యం. వాటిలో… ఓ సూపర్ ఫైట్ ఉందట.
పద్నాలుగు మంది అమ్మాయిలతో విజయ్ ఫైట్ చేసే సీన్.. ఈ సినిమాకే హైలెట్ గా నిలవబోతోందని టాక్. ఆ పద్నాలుగుమంది అమ్మాయిలూ మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణులే. వాళ్లని పూరి ఫారెన్ నుంచి తీసుకొచ్చాడు. ఈ ఫైట్ కే భారీ మొత్తం ఖర్చు చేయాల్సివచ్చిందట. ప్రీ క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఈ ఫైట్… థియేటర్లో ఓ బ్లాస్ట్ లా పేలబోతోందని టాక్. మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. టైసన్‌తో లైగర్ తలపడేది క్లైమాక్స్‌లోనే. ఆ ఫైట్ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో రూందించారని తెలుస్తోంది. ఇవి కాకుండా ఈ సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని చిత్రబృందం ఒకొక్కటిగా రివీల్ చేయాలని భావిస్తోంది.