తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాలం కలసి రావడం లేదు. ప్రధాని మోడీని ఎదురు పడకుండా సొంత రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ బాధ్యతల్ని తలసానికి ఇస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఇతర రాష్ట్రానికి వెళ్లి మరీ మోడీకి ఎదురు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రోజుల కిందట తమిళనాడు నుంచి ఓ ఎంపీ హైదరాబాద్‌కు వచ్చారు. స్టాలిన్ ప్రతినిధిగా వచ్చిన ఆయన ప్రగతి భవన్లో కేసీఆర్‌కు తమ రాష్ట్రంలో జరగనున్న ఫిడె చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. అది స్టాలిన్ పంపిన ఆహ్వానం. వెంటనే కేసీఆర్ తప్పక వస్తానని మాటిచ్చారు.
ఈ ప్రోగ్రా ఈ నెల 28వ తేదీన జరగనుంది. కేీఆర్ తమిళనాడు వెళ్లడం ఖాయమనుకుంటున్న సమయంలో ఇప్పుడు కొత్తగా ఆ పోటీల్ని మోదీ ప్రారంభించబోతున్నట్లుగా తేలింది. మోడీ తమిళనాడు పర్యటనపై స్పష్టత రావడంతో ఇప్పుడు అందరి చూపు కేసీఆర్ వైపు పడింది. మోడీ 28వ తేదీన మధ్యాహ్నం తర్వాత తమిళనాడు చేరుకుని.. అక్కడ చెస్ ఒలింపియాడ్ పోటీల్ని ప్రారంభించారు. తర్వాతి రోజు కూడా అక్కడే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని బయలుదేరుతారు.
ఇప్పుడు కేసీఆర్ తమిళనాడు వెళ్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మోడీకి ఎదురు పడదల్చుకోకపోతే వెళ్లరి.. అలాంటిదేమీ లేకపోతే వెళ్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రోగ్రాం జరుగుతోంది తమిళనాడులో కాబట్టి.. స్టాలిన్‌తో ఉన్న ఆత్మీయ సంబంధాల కారణంగా వెళ్లొచ్చని చెబుతున్నారు. ఒక వేళ కేసీఆర్ వెళ్లకపోతే.. మాటిచ్చి వెనక్కి తగ్గినట్లవుతుంది.