ఉపరాష్ట్రపతిగా రిటైర్మెంట్ అయిన తర్వాత వెంకయ్యనాయుడుు రిటైర్మెంటే అని అందరూ అనుకుంటున్నారు. కానీ వెంకయ్యనాయుడు మాత్రం తాను యాక్టివ్‌గా ఉంటానని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. విభజన చట్టంలోని కీలక అంశాలపై కేంద్రమంత్రుల్ని పిలిపించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన వాటిని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సూచించారు.
వెంకయ్యతో రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్‌జోషి, డాక్టర్ జితేంద్రసింగ్ తదితరులు సమావేశమయ్యారు. వీరి శాఖలకు సంబంధించి ఏపీలో పెట్టిన..పెట్టాల్సిన సంస్థల గురించి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలనిసూచించారు. నిజానికి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయా సంస్థల పురోగతి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ సూచనలు చేస్తూ వచ్చారు.
2015, 2016లో కేంద్ర మంత్రి హోదాలో చొరవ తీసుకున్న వెంకయ్యనాయుడు.. సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి ఆయా ప్రాజెక్టులు మంజూరు అయ్యేందుకు కృషి చేశారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత .. జగన్ ర్కార్ కూడా ఆసక్తి చూపించకపోవడంతో వెంకయ్య కూడా ఏమీచేయలేకపోయారు. ఇప్పుడు మరోసారి ఆయన సమీక్షలు ప్రారంభించారు. వెంకయ్యనాయుడు ఏపీ అంశాలపై ఇలా చొరవ చూపడంతో .. పదవి విరమణ తర్వాత ఆయన ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారేమోనన్న చర్చ జరుగుతోంది.