తెలుగు దేశం హయంలో అన్న క్యాంటీన్లు పెడితే పోటీగా రాజన్న క్యాంటీన్లు పెట్టారు వైసీపీ నేతలు. తాము రూ. నాలుగుకే భోజనం పెడతామని.. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు హడావుడి చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరవాత అన్న క్యాంటీన్లు ఎత్తేశారు.. రాజన్న క్యాంటీన్లు ఎత్తేశారు. పేద ప్రజలను ఆకలితో మాడ్చేశారు. ఇంత కాలం ప్రారంభిస్తామని కబుర్లు చెప్పిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పుడు టీడీపీ నేతలు ఉద్యమంలా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు.
ఎక్కడిక్కకడ నియోజకవర్గాల వారీగా అన్న క్యాంటీన్లు పెట్టడమే కాదు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్న క్యాంటీన్ల వద్ద జనం పెద్ద ఎత్తున ఆకలి తీర్చుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్ వస్తోంది. దీంతో వైసీపీ నేతలు కూడా మరోసారి రంగంలోకి దిగారు. రాజన్న క్యాంటీన్లు పెట్టేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. విచిత్రంగా గతంలో టీడీపీ హయాంలో కట్టిన అన్న క్యాంటీన్ భవనాలనే లీజుకు తీసుకుని సొంతంగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు
అనంతపురం జిల్లా గుంతకల్లు లో ఎమ్మెల్యే అన్న క్యాంటీన్ భవనానని లీజుకు తీసుకున్నారు. అక్కడ రాజన్న క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు. ఇది టీడీపీ అన్న క్యాంటీన్‌కు పోటీ. గతంలో ప్రభుత్వం పెట్టిన దానికి పోటీగా పెట్టి.. ఎన్నికల తర్వాత రెండూ తీసేసి కడుపు కొట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు మరోసారి అదే వ్యూహంతో తెరపైకి వస్తున్నారు. వీరంతా ఉద్ధృతంగా అన్న క్యాంటీన్లు తెరిచినా ఆశ్చర్యం లేదు.