తెలంగాణలో మరో స్వాతంత్ర్య పోరాటం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సారి క్రెడిట్ కోసం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల్ని కేంద్రం దేశభక్తుల బ్రాండ్‌తో నిర్వహించాలని తలపెట్టింది. అందుకే అన్ని రాష్ట్రాలను సిద్ధం చేసింది. ఖర్చు రాష్ట్రాలది.. పేరు కేంద్రానికి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదంతా ఎందుకనుకున్నారో కానీ నేరుగా తామే సొంత ప్రణాళిక అమలు చేస్తున్నారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను తెలంగాణలో ఆ పేరు లేకుండా ఇంకా ఘనంగా నిర్వహించాలని ప్లాన ్చేశారు. 15 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక కమిటీని నియమించి..దానికి చైర్మన్‌గా కేశవరావును నియమించారు. ఈ ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆగస్టు 8 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వజ్రోత్సవాలను ఆగస్టు 8న హైటెక్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని చెప్పారు. ముగింపు ఉత్సవాలు 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. 15 రోజుల పాటు తెలంగాణలో పండుగ వాతావరణం ఉంటుంది. కేంద్రం హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలన్నారు. ఆ పేరు లేకుండా రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేసి ఎగురవేయిస్తామని కేంద్రం చెబుతోంది.
కేంద్రం దేశభక్తి కాన్సెప్ట్‌తో నిర్వహిస్తున్న ఉత్సవాలను అంత కంటే ఘనంగా నిర్వహించి.. కేంద్రం కన్నా తమకే ఎక్కువ పేరు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజల మనసుల్లో మానసికంగా.. భావోద్వేగ పరంగా.. దేశం అంటే బీజేపీ.. స్వాతంత్ర్యం తెచ్చింది బీజేపీ అన్న ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తోందని అందుకే రివర్స్ ప్లాన్ అమలు చేయక తప్పడం లేదని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి