మన గడ్డ మీదకు వచ్చి బాగా సంపాదించేసుకుని…. మేము లేకపోతే మీ బతుకులు దుర్బరమే అని ఎవరైనా అంటే ఎవరికైనా మండిపోతుంది. కులాలు, మతాలు డామినేట్ చేస్తున్నా… ఆ ప్రాంతం మొత్తం ఏకమై.. వలస వచ్చిన .. సంపాదించుకుని తమను నానా మాటలు అంటున్న వారిని తరిమికొడుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి మంటే పెట్టారు గవర్నర్ కోషియారి. అసలు ముంబైలో గుజరాతీలు, రాజస్తాన్ వాళ్లు లేకపోతే.. దేశ ఆర్థిక రాజధాని ఎలా అయ్యేదని ఆయన ప్రశ్నించారు. వారంతా వెళ్లిపోతే ముంబైలో అసలు డబ్బులేమీ ఉండవన్నారు. మహారాష్ట్రకు ఆదాయమేమీ ఉండదన్నారు.
ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఈ మాటలు సూటిగా .. సుత్తిలేకుండా ఉండటంతో .. మరాఠీలను ఘోరంగా అవమానించడమేనని రచ్చ ప్రారంభణయింది. మరాఠీ ఉద్యమంతో ఎదిగి.. ఇప్పుడు ఉనికి సమస్యల్లో పడిన శివసేన వెంటనే అందుకుంది. కోషియారీని జైలుకు పంపుతారా.. తరిమికొడతారా అని సూటిగా ప్రశ్నించారు ఉద్దవ్ ధాకరే. ఇప్పుడు ఈ మరాఠీ సెంటిమెంట్‌ను శివసేన ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే.. పోయిన వైభవం అంత ఎక్కువగా వస్తుంది.
మహారాష్ట్ర నుంచి గుజరాతీల్ని.. రాజస్థానీయుల్ని పంపించి వేస్తారా లేకపోతే వాళ్లపై దాడులు చేస్తారా అన్నది కాదు.. ఇప్పుడు శివసేన ఈ పాయింట్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. గవర్నర్ మాటలపై మహారాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గవర్నర్‌ను తప్పు పట్టలేని స్థితిలో బీజేపీ, షిండే వర్గం ఉంటుంది. ఏదో కవర్ చేసినా ప్రజలకు నచ్చదు. ఆయన స్థాయిలో జవాబు చెప్పాల్సిందే. ఇప్పుడు ఈ మంట ఎక్కడికి దాకా వెళ్తుందనేది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.