తెలుగు సినీ చరిత్రలో.. సింగీతం శ్రీనివాసరావుది సువర్ణ అధ్యాయం. `మాయా బజార్` చిత్రానికి సహాయ దర్శకుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369… ఇలా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. 90 ఏళ్ల వయసులో ఇప్పటికీ హుషారుగాన ఉన్నారు. ఇప్పుడు సింగీతం జీవితంపై ఓ బయోపిక్ తయారవుతోంది. యువ దర్శకుడు ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ బయోపిక్‌లో… సింగీతం పాత్రని తరుణ్ భాస్కర్ పోషించడం విశేషం. ఇప్పుడు సింగీతం కథని తెరపైకి తీసుకొస్తున్నారు. సింగీతం పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనేది ఇంకా తేలలేదు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పైప్ లైన్లో ఉంది. ఇవి కాకుండా సోనీ లైవ్ కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందించే పనిలో ఉన్నాడు తరుణ్ భాస్కర్. క్రైమ్ జోనర్లో నడిచే కథ ఇది. సింగీతం బయోపిక్ కంటే ముందు.. ఈ క్రైమ్ సిరీస్ పట్టాలెక్కుతుంది.