జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు వారాలుగా జ్వరంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా ఆయన పవన్ కొత్త ఫామ్ హౌస్ ను కోనుగోలు చేశారని అక్కడో విలాసవంతమైన ఇల్లు కట్టిస్తున్నారని.. దాని విలువ ఎంతో తెలుసా అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో అసలు సత్యాలు కొద్దిగా ఉన్నాయి. అసలు అవాస్తవాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. జనసేన అధినేత కొత్తగా ఎలాంటి ఫాంహౌస్ కొనుగోలు చేయలేదు.
పవన్ కల్యాణ్ చాలా కాలం కిందటే ఓ పదహారు ఎకరాలను హైదరాబాద్ శివారులో కొనుగోలు చేశారు. ఆయనకు ఆవులు, గెదెలను పెంచడం.. వ్యవసాయం అంటే మక్కువ. అక్కడ ఓ చిన్న పాటి ఇంటి నిర్మాణం చేపట్టి ఆ వ్యాపకాలను తనకు వీలున్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆ ఇల్లు పాతదైపోయింది. ఈ కారణంగా ఆ ఇంటిని తొలగించి మరో జీ ప్లన్ వన్ నిర్మాణాన్ని చేపట్టారు. అంటే పాత ఫామ్ హౌస్‌లోనే పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు.అంతే తప్ప.. కోట్లు పెట్టి కొత్త ఫామ్ హౌస్ కొనలేదు.
పవన్ జనసేన పార్టీని ప్రారంభించిన తర్వాత ఏపీలో ఓ ప్రధాన రాజకీయ పార్టీకి టార్గెట్‌గా మారారు. వారు ప్యాకేజీలనీ ప్రచారం చేయడంతో పవన్ కల్యాణ్ కొత్త కార్లు కొనుక్కున్నా ఆదే ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ. యాభై కోట్ల వరకూ చార్జ్ చేసే పవన్ కల్యాణ్‌కు… లక్షలు ఖర్చుపెట్టడం పెద్ద విషయం కాదు. ఆ మాత్రం దానికి ఇతరుల దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. కానీ రాజకీయం అంటే బుదర చల్లడమేనని కొన్ని పార్టీలు అనుకుంటూ ఉంటాయి.