తెలంగాణ బీజేపీ నేతల పోరాటం అమిత్ షాను బాగా ఆకట్టుకుంటోంది. ఇతర రాష్ట్రాల వారికీ ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పని చేయాలని అమిత్ షా ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. బీహార్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను అమిత్ షా పలుమార్లు ప్రస్తావించారు. ఆయన చేస్తున్న పాదయాత్రలు, యాత్రలను గురించి వివరించారు.
వారు చేస్తున్నట్లుగానే మోర్చా నాయకులు చేస్తే బీజేపీ గెలుపు కచ్చితంగా సాధ్యం అవుతుందని అన్నారు పార్టీలో పైపదవుల్లో ఉన్న వాళ్లు గుర్తించి మెచ్చుకుంటే.. పార్టీ శ్రేణులు మరింత కష్టపడతారని అందుకే మోదీ అలా పొగిడారని అనుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపీలు నియోజక వర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు అమిత్ షా తెలిపారు. సమావేశాల అనంతరం మూడు రోజులపాటు ఎంపీలు తమ తన నియోకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హైదరాబాద్లో నెల క్రితం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.
బండి సంజయ్ మూడో విడత పాతయాత్ర ప్రారంభిస్తున్నారు. గతంలోలా ఏ మాత్రం హంగామా తగ్గకుండా ఈ యాత్ర ఉండనుంది. అయితే ఎప్పుడూ చేరికల గురించి హడావుడి చేస్తూంటారు. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి చేరికల హడావుడి ఉండే చాన్స్ లేదు. పార్టీలో చేరేవారంతా.. ఢిల్లీ స్థాయి నేతలతోనే కండువా కప్పించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.