టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం అంటూ రోజంతా జరిగిన డ్రామా .. ఆ పార్టీలోనే కలకలం రేపుతోంది. ఎందుకంటే హత్యాత్నం చేసిన వ్యక్తంటూ అరెస్ట్ చేసిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకే చెందిన వ్యక్తి. ఓ గ్రామ సర్పంచ్ భర్త. టీఆర్ఎస్లో వివాదాలకు నియంగా ఉండే ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నియోజకవర్గంలో జిల్లెడ అనే గ్రామానికి టీఆర్ఎస్ మహిళా నేత సర్పంచ్‌గా ఉన్నారు. ఆమె పదవిని ఇటీవల సస్పెండ్ చేశారు. నిధులు దుర్వినిోయగం చేశారని అదికారులు నివేదిక ఇచ్చారు.
అయితే అభివృద్ధి పనులు చేయించిన బిల్లులు ఇవ్వలేదని.. ఆ విషయంలో ఎమ్మెల్యేతో గొడవ అయిందని… అందుకే తమపైకుట్ర చేశారని ఆ సర్పంచ్ అంటున్నారు. ఆమె భర్త ఎమ్మెల్యేఇంటి దగ్గర అరెస్ట్ కావడంతో ఇదంతా కుట్ర అని ఆమె చెబుతున్నారు. కేవలం నిధుల గురించి అడిగేందుకే తన భర్త ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దగ్గరకు వెళ్లారంటున్నారు. ఆయన వద్ద తుపాకీ.. కత్తీ ఏవీ లేవని..ఉన్నట్లుగా చూపించి తప్పుడు కేసులు పెట్టారని అంటున్నారు.
కారణం ఏదైనా ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై నిజంగానే అదే పార్టీకి చెందిన సర్పంచ్ భర్త దాడికి ప్రయత్నించాడని.. తుపాకీ కూడా తీసుకొచ్చాడనే వార్త కాస్త సంచలనం రేపుతోంది. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలకు ఇదే పెద్ద ఉదాహరణగా చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన సర్పంచ్‌లు నిధులు దుర్వినియోగం చేసినా వారిని పదవి నుంచి తప్పించరు. అలా చేస్తే వారు పార్టీకి దూరమవుతారు. అయితే ఇక్కడ సర్పంచ్‌ను తీసేయడంతో క్యాడర్ విషయంలో నాయకుల తీరు వివాదాస్పదమవుతుందని చెబుతున్నారు.