ఉంటారా .. రాజీనామా చేస్తారా అని మూడున్నరేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్‌కు పజిల్‌గా మారిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎట్టకేలకు తాను కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇరవై ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డామని.. ఇప్పుడు తమపై రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారని.. ఆయన కంట్రోల్లో మేము పని చేయాలా అని ప్రశ్నించారు. తమను ఘోరంగా అవమానించారన్నారు. అయితే రాజీనామా నిర్ణయం మాత్రం మునుగోడు ప్రజల కోసమే తీసుకున్నానని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో టీార్ఎస్ కుటుంబ పాలన చేస్తోందన్నారు. ఒక ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కుటుంబం కనుసన్నల్లో పని చేస్తోందన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయానన్నారు. ఇంకా 18 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిధులు వస్తాయని అభివృద్ధి చేస్తారన్న ఆశతో ప్రజలు ఉన్నారు. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని ప్రకటించారు. ఉపఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో మునుగోడు ప్రజలుతేలుస్తారన్నారు.
తన వ్యాపారానికి రాజకీయానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకే పదవులు కావాలంటే ఎప్పుడో టీఆర్ఎస్లో చేరేవాళ్లమన్నారు. సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్లోకి అహ్వానించారని చెప్పుకొచ్చారు. అయినా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని చేయలేదు…చేయబోమన్నారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా చేస్తానని ఆయనప్రకటించారు. ఉపఎన్నిక నిర్వహించాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నందున.. ఆయన బీజేపీలో చేరిక లాంఛనమేనని అనుకుంటున్నారు.