తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆ పార్టీకి కాస్త ఊపు వచ్చింది. అయితే మొదట్లో ఆయనకు పార్టీలో పెద్దగా చొరవ తీసుకునే అవకాశం కల్పించకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన టీ పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేసులో ఉంది అని చెప్పుకుంటున్నారటే అది రేవంత్ రెడ్డి దూకుడైన నాయకత్వం వల్లనే అని చాలా మంది అభిప్రాయం.
అయితే ఆయన నాయకత్వపై ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. తాము దశాబ్దాలుగా ఉన్నామని ఇప్పుడు బయట నుంచి వచ్చి పెత్తం చేయడం ఏమిటన్నది వారి అభిప్రాయం. ఎప్పుడొచ్చాం కాదన్నది రేవంత్ రెడ్డి.. హైకమాండ్ ఆలోచన. అందుకే సీనియర్లు రేవంత్ రెడ్డితో కలవలేకపోగా.. ప్రత్యామ్నాయాలు చూసుకుటున్నారు. బయటకు వెళ్తున్న నేతలు.. పార్టీలోనే ఉంటున్న జగ్గారెడ్డి , వీహెచ్ లాంటి నేతలు ఎప్పుడు చాన్స్ దొరికినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కుంపట్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ సొంత పార్టీ నేతల అసలు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు.. రేవంత్ రెడ్డినే.
రేవంత్ పై ఎటాక్ చేసే సీనియర్ల జాబితాలో త్వరలో మరికొంత మంది రేవంత్ ను గురి పెట్టి రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అది సొంత పార్టీ నుంచే కాదు.. బీజేపీ నుంచి కూడా. ప్రత్యర్థిని బలం పుంజుకోనీయకుడా చేయడం కూడా.. మరో పార్టీ బలం పెరగడానికి కారణం అనుకోవచ్చు. బీజేపీ రేవంత్ ను టార్గెట్ చేయడం ద్వారా అలాంటి వ్యూహాన్ని తెలంగాణ పార్టీలు అమలు చేస్తున్నాయని అనుకోవచ్చు. అయితే ఇక్కడ బలమైన నాయకునిగా రేవంత్ రెడ్డిని వారంతా ప్రొజెక్ట్ చేస్తున్నారన్న అంశాన్ని మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఆ పేరు .. పార్టీని వీడిపోతున్న వారి వల్ల రాలేదు.. వారు పోవడం వల్ల తగ్గదని.. ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాంటి వారు వెళ్లిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందంటున్నారు.