ఈమధ్య రవితేజ సినిమాలకు రచయితగా ఓ కామన్ పేరు కనిపిస్తోంది. తనే… శ్రీకాంత్ విస్సా. రవితేజ ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలకూ తనే రచయిత. శ్రీకాంత్ పనితీరు, రైటింగ్ స్కిల్స్ రవితేజని బాగా ఆకట్టుకొన్నాయి. అందుకే శ్రీకాంత్ రెడీ చేసిన రెండు కథల్ని.. రవితేజ కొనేసి, వాటిని సినిమాలుగా చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ విస్సా చేతికి మెగా ఫోన్ కూడా అప్పజెప్పబోతున్నాడని టాక్. అవును.. శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడని టాక్. ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన చర్చలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. రవితేజ చేతిలో బలమైన లైనప్ ఉంది. ఒకదాని తరవాత మరోటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. పనిలో పనిగా శ్రీకాంత్ కీ డేట్లు ఇచ్చేయాలని రవితేజ ఫిక్సయ్యాడని టాక్. తన సొంత బ్యానర్ ఆర్.టీ క్రియేటీవ్వర్క్స్ సంస్థలోనే ఈ సినిమాని నిర్మించే అవకాశాలున్నాయి. చాలామంది రైటర్లు దర్శకులుగా అవతారం ఎత్తారు. అయితే… వాళ్లెవ్వరితోనూ రవితేజ ఇప్పటి వరకూ పని చేయలేదు. తొలిసారి… ఓ రైటర్ కి ఛాన్సిచ్చి, డైరెక్టర్ని చేస్తున్నాడు రవితేజ. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.