విక్రమ్ ఇచ్చిన స్ఫూర్తితో భారతీయుడు 2 మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది. సెప్టెంబరు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. భారతీయుడు 2లో కాజల్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఆమెపై కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఆ తరవాత పరిస్థితులు మారాయి. కాజల్ కి పెళ్లయ్యింది. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లి కూడా. అందుకే కాజల్ ని తప్పించి, ఆమె స్థానంలో మరో కథానాయికని తీసుకుంటారని, కాజల్ పై తెరకెక్కించిన సన్నివేశాల్ని రీషూట్ చేస్తారని చెప్పుకొన్నారు. వీటిపై కాజల్ క్లారిటీ ఇచ్చింది.
భారతీయుడు 2లో తనని తీసేయలేదని, తన పాత్ర అలానే ఉందని, సెప్టెంబరు నుంచి కూడా షూటింగ్ లో పాల్గొంటాననని క్లారిటీ ఇచ్చింది. ఇన్ స్టాలో అభిమానులతో కాజల్ సరదాగా చిట్ చాట్ చేసింది. ఈసందర్భంగా `భారతీయుడు 2` విశేషాలను బయటపెట్టింది. సో… భారతీయుడులో కాజల్ స్థానాన్ని రిప్లేస్ చేశారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. మరోవైపు శంకర్ చేతిలో రామ్ చరణ్ సినిమా కూడా ఉంది. దాంతో సమాంతరంగా భారతీయుడు 2 పనులు పూర్తి చేయాల్సి ఉంది. నెలకు సగం రోజుల చరణ్ సినిమాకీ, మరో సగం రోజులు చరణ్ సినిమాకీ కేటాయించేలా శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.