నిర్మాతలంతా కలిసి బంద్‌కి పిలుపు ఇచ్చినా – అది పాక్షికంగానే సాగుతోంది. `మాది తెలుగు సినిమా కాదు.. తమిళ సినిమా` అనే క్లాజ్‌తో దిల్ రాజు తన `వారసుడు` సినిమాని గప్ చుప్ గా లాగించేస్తున్నారు. ఇదే పాయింట్ తో `సార్` షూటింగ్ కూడా ఎలాంటి బ్రేకులు లేకుండా సాగుతోంది. దీనిపై చాలామంది నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సోమవారం నుంచి షూటింగులు మళ్లీ యధావిధిగానే సాగబోతున్నాయని టాక్. పైకి `బంద్..` అని చెప్పినా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతున్నారు నిర్మాతలు. రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` షూటింగ్ సోమవారం ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు… నాలుగైదు పెద్ద సినిమాలూ సోమవారం నుంచి షెడ్యూల్ కి ప్లాన్ చేసుకొన్నాయి. `బంద్`కి పిలుపు ఇచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ జరుపుకొంటున్నాయి.చిన్నా, చితకా సినిమాలు మామూలే. దాంతో… నిర్మాతలు తలపెట్టిన బంద్ అనేది కేవలం నామమాత్రపు ప్రకటనగానే మిగిలిపోయింది. మరోవైపు గిల్డ్ మాత్రం కీలకమైన సమావేశాల్ని కొనసాగిస్తూనే ఉంది. ఈనెల 15 నాటికి చర్చలన్నీ ఓ కొలిక్కి వస్తాయని, 16 నుంచి బంద్ పూర్తిగా ఎత్తేస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. బంద్ ఉన్నా, లేకున్నా షూటింగులకు అడ్డు లేనప్పుడు అది ఎత్తేయడమే నయమన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.