‘డీజే టిల్లు’… ఈ క్యారెక్టర్ వెండి తెరపై ఓ సంచలనం సృష్టించింది. టిల్లూ మాటలు, బాడీ లాంగ్వేజ్, గెటప్ అన్నీ హిట్టే. ఈ పాత్రతో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు అని రూఢీ అయిపోయింది. అందుకే పార్ట్ 2 మొదలెట్టేశారు. డీజే టిల్లు లో నేహా శెట్టి కథానాయికగా నటించింది. డీజే డైలాగులతోనే ‘రాధిక..’ అనే పాత్ర కూడా పాపులర్ అయిపోయింది. పార్ట్ 2లో ఇప్పుడు ‘రాధిక’ లేదు. నేహా శెట్టి పాత్రలో మరో అందమైన కథానాయికని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఆ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చే అవకాశాలున్నాయి. అనుపమతో చిత్రబృందం మంతనాలు మొదలెట్టింది.
tఈమధ్య బోల్డ్ సీన్స్ చేయడానికి అనుపమ అభ్యంతరం చెప్పడం లేదు. ‘డీజే టిల్లు’లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. పార్ట్ 2లోనూ అవి కొనసాగే అవకాశాలున్నాయి. వాటికి అనుపమ ‘ఓకే’ అంటే డీజే టిల్లులోకి అనుపమ ఎంట్రీ ఇచ్చినట్టే. డీజే టిల్లు కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తను ఈ ప్రాజెక్టు నుంచి ముందే తప్పుకొన్నాడు. అతని స్థానంలో మల్లిక్ రామ్ (అద్భతం ఫేమ్) ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2023లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.