సాలు దొర – సెలవు దొర అంటూ కేసీఆర్ పాలనపై ప్రచారానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న తెలంగాణ బీజేపీకి ఈసీ షాక్ ఇచ్చింది. అది రాజకీయ నేతలను కించ పరిచే విధంగా ఉందని.. ఆ ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ప్రచారాలు చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. మీడియా కమిటీ వద్ద ఇందు కోసం తెలంగాణ బీజేపీ దరఖాస్తు చేసుకుంది. లు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది.
రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఖరాఖండీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈసీ నిర్ణయం బీజేపీకి ఇబ్బందికరమే. ఎందుకంటే ఈ క్యాంపెన్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఒక్క స్లోగన్‌తో కేసీఆర్‌ను దొరగా ప్రోజెక్ట్ చేయవచ్చని అనుకున్నారు. ఈ మేరకు కౌంట్ డౌన్ బోర్డును కూడా తెలంగాణ బీజేపీ ఆఫీసు ముందు పెట్టారు. ఈ అంశం కూడా దుమారంరేగింది. టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.
అయినప్పటికీ.. బీజేపీ ఈ ప్రచారం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నకిల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.టైటిల్‌ను మార్చి ఆ క్యాంపెన్‌ను కొనసాగిస్తారా లేకపోతే. ఈసీ ఉత్తర్వులను లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. తమకు వ్యతిరేకంగా ఈసీ నిర్ణయం రావడం బీజేపీ నేతల్ని కూడా ఆశ్చర్ పరిచింది.