మునుగోడు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభించేసరికి బీసీ నినాదం తెరపైకి వచ్చింది . ఇప్పటి వరకూప్రధాన రాజకీయపార్టీలన్నీ రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో దానిని క్యాష్ చేసుకునేందుకు ఏ పార్టీ కూడా ఆసక్తి చూపడం లేదు. అన్ని పార్టీలు రెడ్డి అభ్యర్థులకే సీటిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు 2018లో పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో లక్షా28వేల 460 మంది బీసీ ఓటర్లు ఉండగా.. రెడ్డి కులానికి చెందిన ఓట్లు కేవలం 7690 మాత్రమే ఉన్నాయి. మూడు పార్టీలు రెడ్డికి కేటాయించడం బీసీ వర్గాల్లో చర్చకు కారణం ్వుతోంది.
బీసీ నినాదం ఎక్కువైతే టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూజాబీసీ రాగం అందుకునే చాన్సులున్నాయన్న వాదన వినిపిస్తోంది. మునుగోడు ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ ఇప్పటికే బీసీకి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఈ అంశంపై నియోజకర్గంలో విస్తృత చర్చ జరిగితే చివరికి అన్ని పార్టీలూ బీసీ అభ్యర్థివైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మైనస్ అవుతుంది.