ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఫోన్ల నుంచి తీసుకుని చేసే అభిప్రాయసేకరణలో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తేలిసింది. ఉన్న ఇరవై ఐదు సీట్లు యూపీఏ, ఎన్డీఏలకు రావని తేల్చింది. వైసీపీకి పద్దెనిమిది.. టీడీపీకి ఏడు సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. గత నెలలో చేసిన సర్వేలో టీడీపీకి ఆరు సీట్లు వేశారు. ఈ సారి మాత్రం ఒక సీటు పెంచారు. జనసేన సంగతేమిటో చెప్పలేదు. ఏపీ రాజకీయాల్లో జనసేన డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ విషయాన్ని ఇండియా టుడే పరిగణనలోకి తీసుకోలేకపోయింది.
అయితే మూడేళ్ల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత సహజంగా కనిపించదు. కానీ భారీగా సీట్లు కోల్పోతున్న పరిస్థితిని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇండియా టుడేతో ఏపీ ప్రభుత్వ పెద్దలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సర్వేను ప్రజెంట్ చేసిన రాహుల్ కన్వల్ కు జగన్. బీజేపీ అంటే అభిమానం ఉంటుంది. పలుమార్లు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దేశం మొత్తం మీద .. రెండున్నరలక్షల మంది శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు. అందులో లక్ష లోపు మందినే ఇంటర్యూ చేశారు. ఆ ఫలితాలను ప్రకటించారు.
ఈ సర్వేలో బీజేపీకి హిందీ పాలిత రాష్ట్రాల్లో వందకు వంద శాతం సీట్లు వేశారు. గుజరాత్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ , మధ్యప్రదేశ్ ఇలా అన్నింటిలోనూ ఒక్క సీటు కోల్పోకుండా బీజేపీ సాధిస్తుందని సర్వే చేశారు. బీజేపీ ఒంటరిగా 286 సీట్లు సాధిస్తుందని చెప్పుకొచ్చారు. గత నెలలో ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలోనూ దాదాపుగా ఇదే ఫలితాలు వచ్చాయి. ఆ సర్వే టీడీపీకి ఆరు సీట్లు ఇవ్వగా.. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏడు సీట్లు వస్తాయని విశ్లేషించింది.
మొత్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ .. క్షేత్ర స్థాయిలో చేసే సర్వే కాదు. ఫోన్ల ద్వారా చేసే సర్వే. దీనిఖచ్చితత్వానికి ఇండియా టుడే కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు.