రేవంత్ రెడ్డి సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చే్యడం.. వెంటనే రేవంత్ రెడ్డి మారో మాట మాట్లాడకుండా.. బ్రదర్ సారీ అని చెప్పడం కామన్ అయిపోతోంది. అనవసరంగా సారీగా అడుగుతున్నా.. రేవంత్ పంతానికి పోతాడేమో… అలుసుగా తీసుకుందామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటున్నారు కానీ రేవంత్ సీన్‌ను అక్కడి దాకా తీసుకురావడం లేదు. కోమటిరెడ్డి డిమాండ్‌కు తగ్గట్లుగా స్పందిస్తున్నారు. ఇటీవల చండూరులో నిర్వహించిన సభలో కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దానికే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి క్షమాపణ అడిగారు. రేవంత్ తన తప్పేమి లేకపోయినా క్షమాపణ చెప్పారు. ఇప్పుడు కోమటిరెడ్డి ఎలా స్పందిస్తార్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ క్షమాపణ చెబితే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వస్తానని ఆయన షరతు పెట్టారు. ఇప్పుడు క్షమామణ చెప్పినందున రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారానికి వస్తారేమో చూడాలన్న వాదన కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. నిజానికి కోమటిరెడ్డికి కాంగ్రెస్‌లో ఉండాలని లేదని.. గెంటించుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నారని చెబుతున్నారు.
సోదరుడితో కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న వాదనవినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజకీయానికి రేవంత్ రెడ్డి పక్కాగా కౌంటర్ ఇస్తున్నారు. తాను ఎంత తగ్గుతున్నా..కోమటిరెడ్డినే లొల్లి చేస్తున్నారన్న భావన రేవంత్ పంపుతున్నారు. దీంతో కోమటిరెడ్డికి ఎలా ముందడుగు వేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.