సలార్ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. సెప్టెంబరు 28, 2023న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలైపోయారు. ఎందుకంటే ఇలాంటి అప్ డేట్ కోసమే వాళ్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. హ్యాపీనే. కాకపోతే.. ఇప్పుడు వాళ్లకో కొత్త బెంగ పుట్టుకొచ్చింది. సెప్టెంబరు 28.. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి పీడకల మిగిల్చిన రోజు. ఎందుకంటే.. ఆ రోజు `రెబల్` విడుదలైంది. ప్రభాస్ – రాఘవ లారెన్స్ కాంబోలో రూపొందించిన సినిమా ఇది. కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పైగా ఈ సినిమాతో దర్శకుడికీ, ఆ చిత్ర నిర్మాతలకూ కూడా గొడవలయ్యాయి. ఫ్లాప్ సినిమా తీసినందుకు, నిర్మాతలకు ఫైన్ రూపంలో కొంత డబ్బుని తిరిగి చెల్లించాడు రాఘవ లారెన్స్. ఆ దెబ్బ లారెన్స్ మీద కూడా గట్టిగా పడింది. ఆ తరవాత.. పెద్ద సినిమాల జోలికే వెళ్లలేదు. అలా.. రెబల్ ప్రభాస్ ఫ్యాన్స్కి పీడ కలలా మిగిలింది. ఇప్పుడు.. అదే రోజున సలార్ విడుదల అవుతోందన్నది వాళ్ల బెంగ. చిత్రసీమలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఫ్లాప్ సినిమా విడుదలైన రోజున.. మరో సినిమాని వదలడానికి హీరోలు ఏమాత్రం ఆసక్తి చూపించరు. కానీ ప్రభాస్ మాత్రం డేర్ చేస్తున్నాడు.