తెలంగాణ రాజకీయాలు స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఉద్రిక్తంగా మారాయి. బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ.. జనగామ జిల్లాలో రేగిన వివాదం రోజుంతా టెన్షన్ పుట్టిస్తూనే ఉంది. యాత్రకు పోలీసు బందోబస్తును పూర్తిగా తిరస్కరించిన బండి సంజయ్ కార్యకర్తలే రక్షణగా ఉంటారని చెప్పుకొచ్చారు . బీజేపీ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి .. టీఆర్ఎస్కు స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చారు. ఆరు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని.. తర్వాత మీ సంగతేంటని పోలీసుల్ని కూడా హెచ్చరించారు.
అయితే బండి సంజయ్ పై టీఆఎస్ నేతలు దాడి చేయలేదని ప్రైవేటు సైన్యంతో వందలాది మంది బౌన్సర్లను పెట్టుకుని యాత్ర చేస్తూ.. టీఆర్ఎస్ బలంగా ఉన్న దేవరుప్పుల గ్రామంలోతమ పార్టీ కార్యకర్తలైనే దాడులు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమపై దాడులు చేసి తమనే నిందిస్తున్నారా అని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. తప్పు ఎవరిదైనా కానీ.. రాజకీయం మాత్రం దాడుల వైపు వెళ్లిపోయింది. ఎదురుదాడి విషయంలో బీజేపీ మాత్రం దూకుడుగా ఉంది. రాజాసింగ్ దగ్గర్నుంచి అందరూ.. తాము వస్తే సంగతి తేలుస్తామన్న ప్రకటనలు చేశారు.
మరో వైపు ఖమ్మం జిల్లాలోనే తమ్మినేని కృష్ణయ్య అనే ఓ టీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసి చేతులు నరికీ తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన కలకలం రేపింది. ఆయన తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా ఉన్నారు. ఆయన హత్యకు కారణం అంటూ గ్రామస్తులు.. స్వగ్రామంలో ఓ కమ్యూనిస్టు పార్టీ నేత ఇంటిని ధ్వంసం చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజునే ఈ ఘటనలు జరగడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కారణం అయింది.