శాసనమండలి చైర్మన్ అంటే.. రాజ్యంగ పదవి. ఆయనపై ఎవరైనా నిఘా పెట్టలగరా ? కానీ ఏపీ అసెంబ్లీలో డిప్యూటేషన్ పై వచ్చిన ఓ అధికారి ఆయనపై నిఘా పెట్టేశారు. ఏకంగా ఆయన చాంబర్ వైపు సీసీ కెమెరా పెట్టేశారు. స్వయంగా శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఆయనను పిలిచి.. పద్దతిగా చెప్పారు. ఎందుకంటే.. ఆయన ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఆ పోస్టులోకి వచ్చారు. అదే ధైర్యం ఆయనకు ఉన్నట్లుగా ఉంది.
చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. ఆ సీసీ కెమెరాను చైర్మన్ చాంబర్ వైపు నుంచి తప్పించలేదు. ఇంకా ఒత్తిడిచేస్తే.. అంత సీక్రెట్ సమావేశాలు ఎవరితో నిర్వహిస్తున్నావని.. సీసీ కెమెరా ఉంటే భయం ఎందుకు అని సొంత పార్టీ నేతలే అడుగుతారని ఆయన కూడా ఆగిపోయారు. పెద్దగా పట్టించుకోవడం లేదు. మండలి చైర్మన్ విషయంలోనే ఇలా ఉంటే ఇతరుల విషయంలో మాత్రం ఆ అధికారి అంత సాఫ్ట్ గా ఉంటారా..? చాన్సే లేదు. ఆయన ఉద్యోగుల్ని సొంత పనులకు వాడుకుటున్నారు. సొంతంగా డ్రైవర్ను పెట్టుకుని వారి జీతాలను.. సిబ్బంది నుంచి ఇప్పిస్తున్నారు. ఇలాంటి లీలలు చాలా జరుగుతున్నాయి. అయితే ఆయన ప్రభుత్వ పెద్దలకు దగ్గర కాబట్టి అందరూ భరిస్తున్నారు.
కానీ ఆయన చేస్తున్న పనులను మాత్రం వీలైనంతగా మీడియా వర్గాలకు లీక్ చేస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించిన అంశం కావడంతో ఆయన పేరు బయట పెట్టి రాయడానికి మీడియా కూడా సిద్ధపడటం లేదు. అయితే త్వరలో అసెంబ్లీ ఉద్యోగాలు ఆయన నిర్వాకాలకు వీడియో ఆధారాలను.. మీడియాకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎప్పుడైనా ఆయన వీడియోలు హైలెట్ కావొచ్చన్న ప్చారం జరుగుతోంది.