రంగీలా… రాంగోపాల్ వర్మ తడాఖాని బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా. ఊర్మిళని ఈ సినిమా సూపర్ స్టార్ ని చేసింది. నిజానికి.. ఈ కథ చిరంజీవి, రజనీ కాంత్, శ్రీదేవిలతో చేయాల్సిందట. ఈ విషయాన్ని అశ్వనీదత్ ఓ సందర్భంలో చెప్పారు.
శివ సినిమా చూసి.. అశ్వనీదత్ థ్రిల్లయిపోయి, వర్మ చేతిలో అడ్వాన్స్ పెట్టారు. ఆ తరవాత… రంగీలా, గోవింద – గోవింద ఈ రెండు కథల్నీ వర్మ వినిపించాడు. రంగీలాని.. చిరు, రజనీకాంత్, శ్రీదేవిలతో తీస్తే సూపర్ హిట్టవుతుందని వర్మ నమ్మాడు. కానీ.. అశ్వనీదత్‌కి మాత్రం `గోవింద గోవింద` కథ నచ్చింది. తిరుమల వెంకటేశ్వరుడి ఆలయంలో… దోపిడీ అనే కథ ఆసక్తికరంగా ఉంటుందని భావించారు. పైగా వెంకటేష్ అందుబాటులో ఉండే హీరో. అందుకే రంగీలాని పక్కన పెట్టి – గోవింద గోవింద తీశారు. దానికి తోడు.. రంగీలా అయితే… అందులో శ్రీదేవి క్యారెక్టరే హైలెట్ అవుతుంది. మిగిలిన ఇద్దరు హీరోలవీ అతిథి పాత్రల టైపే. అందుకే.. అశ్వనీదత్ ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. తీరా చూస్తే… గోవింద – గోవింద ఫ్లాప్ అయ్యింది. రంగీలా సూపర్ హిట్టయ్యింది. నిజానికి చిరు, రజనీ, శ్రీదేవిలతో రంగీలా తీసుంటే ఏమైపోయేదో మరి..?!