అగ్ర హీరో సినిమా అంటే కనీసం ప్రొడక్షన్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ అంటే…. ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్‌కి ఏదీ ఓ పట్టాన నచ్చదు. మేకింగ్ విషయంలో రాజీ పడడు. అందుకే త్రివిక్రమ్ సినిమాలు లేటవుతుంటాయి. మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమాని మాత్రం ఆఘమేఘాల మీద పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.
ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటించేశారు. 2023 ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అంటే ఇంకా ఎనిమిది నెలలు ఉంది. ఈలోగా.. షూటింగ్ అయిపోవాలి. పోస్ట్ ప్రొడక్షన్స్ జరిగిపోవాలి.. ప్రమోషన్లు పూర్తి చేసుకోవాలి. అంటే… చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ సినిమాని ముగించాల్సి ఉంటుంది. స్క్రిప్టు ఎప్పుడో సిద్ధమైంది. ఈనెలలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారు. ఒకసారి సెట్స్‌పైకి వెళ్లాక.. ఎలాంటి విరామం లేకుండా ఏకధాటిగా షూటింగ్ ముగించాలన్నది ప్లాన్. ఎందుకంటే.. త్రివిక్రమ్ సినిమా ముగిసిన వెంటనే, రాజమౌళి తో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కి టైమ్ తీసుకుంటారు. సినిమా మొదలెట్టకముందే హీరోతో కొంత ట్రావెల్ చేస్తారు. రాజమౌళికి వీలైనంత త్వరగా టచ్‌లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని మహేష్ కూడా డిసైడ్ అయ్యాడట. అందుకే ఇప్పుడు రిలీజ్ డేట్ లాక్ చేసి, షూటింగ్ మొదలెడుతున్నాడు త్రివిక్రమ్.
MAHESH BABU – TRIVIKRAM: RELEASE DATE LOCKED… One of the biggest combinations – #MaheshBabu and director #Trivikram – have finalised the release date of #SSMB28: 28 April 2023… Costars #PoojaHegde… Produced by Haarika & Hassine Creations. #SSMB28From28April pic.twitter.com/NYq0By8G69
— taran adarsh (@taran_adarsh) August 18, 2022