ఉమ్మడి నెల్లూరు వైసీపీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఒకరికొకరికి పడటం లేదు. పార్టీ పైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవులు రాలేదని కొందరు.. వచ్చినవి తీసేసేశారని మరికొందరు రగిలిపోతున్నారు. తరచూ బయటపడుతున్నారు. పార్టీలోనే తనపై కుట్రలు చేస్తున్నారని.. టీడీపీ నేతలకు డబ్బులు కూడా ఇస్తున్నారని .. ఫోన్లు మాట్లాడుతున్నారని అవన్నీ బయట పెడతానని తాజాగా అనిల్ కుమార్ హెచ్చరించారు. దీంతో వైసీపీలో ఏదో జరుగుతోందన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డికి మంత్రి పదవులు రావడంతో ఇతరులు ఫీలరయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత చాన్స్ వస్తుదేమోనని భావించారు. ఆనం. నల్లపురెడ్డి లాంటి సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి జగన్ చాన్సిచ్చారు. దీంతో వారు రగిలిపోతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. నిన్నటిదాకా చంద్రబాబును, టీడీపీని బండ బూతులు తిట్టిన నల్లపురెడ్డి ఇప్పుడు ఎందుకొచ్చిన గొడవ అని మామూలు రాజకీయం చేసుకుంటున్నారు.
ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా తాను లేదా తన రెండో భార్యను పోటీ పెట్టడానికి రెడీ అయ్యారు. అన్న రాజమోహన్ రెడ్డితో కూడా ఆయన దూరం జరిగారు. గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు.. ఎస్సీ కోటాలో మంత్రి పదవులు ఆశించినా దక్కలేదు, ప్రస్తుతానికి ఆనం సైలెంట్ గానే ఉన్నారనుకున్నా, ప్రసన్న సర్దుకుపోయారనుకున్నా, శ్రీధర్ రెడ్డి తన పని తాను చేసుకుంటున్నారని అనుకున్నా… 2024నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.