ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలోనూ కలకలం రేపే అవకాశఆలు కనిపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు 15 మందిని ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా సీబీఐ పేర్కొంది హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఎ 14గా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉండటం కలకలం రేుపతోంది. లిక్కర్ స్కామ్‌లో ఏ1 గా సిసోడియా పేరు .. ఏ14 గా రాంచంద్ర పిళ్లై పేరును చేర్చారు. ఇండో స్పిరిట్ పేరుతో బెంగళూరు కేంద్రంగా లిక్కర్ రాంచంద్ర పిళ్లై లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఆయన ఆయన ఆ కంపెనీలో డైరక్టర్‌గా లేరు.
కానీ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ అనే కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీలో ఆయనతో పాటు ఉన్న మరో డైరక్టర్ పేరు బోయినపల్లి అభిషేక్. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా టెండర్ దక్కించుకోవడానికి అరుణ్ పాండ్యా ద్వారా మనీష్ సిసోడియాకు డబ్బులు ఇచ్చినట్లుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. రూ. 2.50 కోట్లు సిసోడియాకు లంచంగా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ స్కాంతో తెలంగాణకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఢిల్లీలో ప్రకటించారు.
కొత్త పాలసీ రూపకల్పన .. స్కామ్ అంతా అంతా తెలంగాణలోనే జరిగిందని ఆయన అంటున్నారు. ఈ డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లకు మనీష్ సిసోడియా వెళ్లారని తెలిపారు. ఇందులో 10 నుంచి 15 మంది ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిసోడియా కూడా ఉన్నారని భావిస్తున్నట్టు వివరించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ వరకూ వచ్చినట్లుగా తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై శాశ్వత నివాసం హైదరాబాద్ లో ఉంది. దీంతో ఇక్కడా రాజకీయ ప్రకంపనలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది.