వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయడం లేదు. కమ్యూనిస్టులతో పొత్తు ఖరారు చేసుకున్నారు. ముందుగా కమ్యూనిస్టులు మునుగోడులో టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారు. మునుగోడులో టీఆర్ఎస్కు సపోర్ట్ చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో .. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు పొందేందుకు ప్లాన్ చేసింది సీపీఐ. తెలంగాణ సీపీఐ పార్టీ మునుగోడులో కీలకంగా ఉంది. అక్కడ ఆ పార్టీకి కనీసం ఇరవై వేల ఓటింగ్ ఉంటుందని అంచనా. ఈ క్రమంలో ఆ పార్టీ మద్దతు కోసం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు.
కేసీార్ ఆతృత అర్థం చేసుకున్న సీపీఐ పక్కాగానే బేరం ఆడింది. ఈ ఉపఎన్నికల్లో తాము మద్దతిస్తాం.. కానీ వచ్చే ఎన్నికల సంగతేమిటని ప్రశ్నించింది. దానికి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగిద్దామని భరోసా ఇచ్చారు. దీనికి అంగీకరించిన సీపీఐ నేతలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. ఇది మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్‌లో కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. గత ఎన్నికల్లో మహా కూటమితో పోటీ చేసిన సీపీఐకి మూడు సీట్లు కేటాయించారు.అయితే మూడు సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేశారు. దాంతో సీపీఐ హర్ట్ అయింది.
వచ్చే ఎన్నికల్లో కనీసం కేసీఆర్ మూడు సీట్లయినా కేటాయిస్తే చాలనుకుంటోంది. మునుగోడులో పోటీ చేసినా గెలిచే చాన్స్ లేకపోవడంతో.. అక్కడ తమకు ఉన్న బలాన్నే ఉపయోగించుకుంది. ఇప్పటికి అయితే కేసీఆర్ భవిష్యత్‌లోనూ పొత్తుకు ఓకే అంటారు కానీ… అసలైన ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి ఏమంటారో చెప్పలేమని రాజకీయ వర్గాలంటున్నాయి. అయితే కేసీఆర్‌పై సీపీఐ తెలంగాణ నేతలు నమ్మకం పెట్టుకున్నారు.