బ్యాంకులో డబ్బులు వేస్తే ట్యాక్స్.. తీస్తే ట్టాక్స్.. వాటిని ఖర్చు పెట్టినా ట్యాక్స్. కొనే వస్తువు మీదనే కాదు.. ఇప్పుడు చెల్లిస్తున్నందుకు కూడా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. నోట్ల రద్దు చేసి.. అంతా డిజిటల్ పేమెంట్స్ కోసం ప్రోత్సహించిన కేంద్రం ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నందుకు చార్జీలు వసూలు చేసే ఆలోచనలో ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లి కొనుగోలు చేసి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం .. అమెజాన్ పే వంటి వాటితో డబ్బు చెల్లిస్తే.. ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
అంటే.. మన ఓ వస్తువును కొని.. డబ్బు చెల్లిస్తున్నందుకు కూడా ట్యాక్స్ కట్టాలన్నమాట. త్వరలోనే ఈ చార్జీల గురించి కేంద్రం ప్రకటన చేయబోతోంది. ఎంతెంత వసూలు చేయాలన్నదానిపై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. ఇప్పికే నగదు చెల్లింపులపై ఆంక్షలు ఉన్నాయి. చాలా చిన్న దుకాణాల్లో సైతం యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారు. నగదును జేబులో పెట్టుకోవడం తగ్గిపోయింది. ఇదంతా ప్రభుత్వం నోట్ల రద్దు వల్లనే సాధ్యమయింది.
ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ పై చార్జీలు వేయాలనుకుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే ప్రతీ దశలోనూ పన్నులు వసూలు చేస్తున్న కేంద్రం.. ఇప్పుడుకొన్న వస్తువుకు డబ్బులు చెల్లించినా చార్జీలు కట్టాల్సి వచ్చేలా చేస్తున్నారు. ప్రభుత్వాలను నిందించి ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ దశ కూడా దాటిపోయింది. ప్రభుత్వం కట్టమన్నంత కట్టుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.