ఏపీ సీఎం జగన్ సడన్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. మొదట ఆయన మంగళవారం వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన ఢిల్లీ టూర్ గురించి మీడియాకు తెలిసే సరికి.. దేశ రాజధానిలో వాలిపోయారు. ఇది హడావుడిగా జరిగిందా లేకపోతే.. సీక్రెట్‌గా ఉంచి.. లేటుగా బయట పెట్టారా అన్నది క్లారిటీ లేదు. మంగళవారం కాదు సోమవారమే ప్రధాని మోదీ, అమిత్ షాలతో ఆయన భేటీ ఉంటుందని తేలిపింది. నిజానికి మంగళవారం ఆయనక నేతన్న హస్తం కింద నిధులు విడుదల చేయాల్సి ఉంది.
ఇందు కోసం కృష్ణా జిల్లాలో ఏర్పాట్లు చేశారు. కానీ ఆ బటన్ నొక్కే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుని ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇది ప్లాన్డ్ కాదని.. హడావుడి టూర్ అని భావిస్తున్నారు. జగన్ ఇంత హడావుడిగా ఎందుకు ఢిల్లీకి వెళ్లారన్నది ఇప్పుడు వైసీపీలోనూ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం అని బయటకు చెబుతారు కానీ ఎప్పుడూ ఆయన ఈ విషయంలో మోదీతో భేటీ అయి సాధించిందనదేమీ లేదు.
కేంద్రం కూడా ఆయన ఏమీ అడగనట్లే ఉంటోంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం రాజకీయ పరంగా ప్రయోజనాలు మాత్రం పొందుతున్నారు. ఈ సారి కూడా అలాంటి ఏజెండా ఏదైనా ఉందా అన్నదానిపై క్లారిటీ లేదు. అధికారంగా వెల్లడించరు. మోదీతో భేటీ తర్వాత అమిత్ షానూ.. కలిసే అవకాశం ఉంది…కాబట్టి కీలకమైన రాజకీయ అంశాలపైనే జగన్ ఢిల్లీ టూర్ జరుగుతోందన్న ప్రచారం ఎక్కువగా ఉంది.