ఉండవల్లి అరుణ్ కుమార్ .. అరిగిపోయిన మార్గదర్శి కేసును మరోసారి జగన్ కోసం సుప్రీంకోర్టు వద్దకు తీసుకెళ్లారు. మార్గదర్శిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. తెలియకుండా కోర్టులో కేసు కొట్టి వేశారని ఆయన వాదిస్తున్నారు. ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఏమన్నదో బయటకు చెప్పలేదు కానీ మీడియా ముందుకు వచ్చి ఎప్పట్లాగే మార్గదర్శి .. రామోజీరావుపై విమర్శలు చేశారు.
మార్గదర్శి కేసులో రామోజీరావు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ నిర్ణయంతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. ఈ కేసులో తప్పక ఫలితం తేలుతుంది. మార్గదర్శి అవినీతి బట్టబయలవుతుంది. కోర్టు ముందు అందరూ సమానమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
్
నిజానికి ఈ కేసును ఏపీ హైకోర్టు ఎప్పుడో కొట్టి వేసింది. అయితే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుట్టు చప్పుడు కాకుండా కేసు కొట్టేసిందని ఉండవల్లి ఆరోపిస్తున్నారు. ఈ కేసు కొట్టేసిన విషయం తనకు ఏడాది తర్వాత తెలిసిందని చెబుతున్నారు. అయితే అలా తెలిసిన తర్వాత వెంటనే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. తీరిగ్గా వెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతామని భరోసా ఇచ్చి..ఆయనకు పని చెప్పిన తర్వాతే కదిలినట్లుగా తెలుస్తోంది. అయితే ముగిసిపోయిన కేసు.. తాము బాధితులమని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయని కేసులో ఉండవల్లి.. ఏం సాధిస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే రామోజీరావు పేరును బద్నాం చేయడానికి ఆయన ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.