బీజేపీ రాజకీయాల దెబ్బకు షివరైపోతున్న ప్రభుత్వాల జాబితాలో జార్ఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు చేరాయి. ఈ రెండు ప్రభుత్వాల్లోని వారిపై ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయి. అక్కడి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపైనా గురి పెట్టినట్లుగా చెబుతున్నారు. జార్ఖండ్లో సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఉన్నారు. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ నేరుగా ఈసికి సిఫార్సు చేశారు. ఎందుకంటే ఆయన పేరుపై గనులున్నాయని.. ఆయన లాభదాయ పదవిని కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.
ఇప్పటికే జార్ఖండ్లో సీబీఐ పలువురు ఆ కూటమిపార్టీలకు చెందిన వారిపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా సీఎంహేమంత్ సోరెన్ సన్నిహితులను టార్గెట్ చేసింది. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టంగా మారింది. అదే సమయంలో ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో రెండు,మూడు తప్ప మొత్తం సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వణికిపోతోంది. తమకు పాతిక కోట్లు ఆఫర్ చేశారని నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తెర ముందుకు వచ్చి చెప్పారు .. అయితే చాలా మంది ఆప్ నాయకత్వంతో టచ్ లో లేకుండా పోయారు. కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశానికి రాలేదు.
తమ ప్రభుత్వం పడగొట్టాలంటే ఒక్కొక్కరికి ఇరవై కోట్ల చొప్పున నలభై మందికి ఎనిమిది వందల కోట్లివ్వాలని.. ఈ మేరకు ఆఫర్లురెడీ చేసి బీజేపీ ప్రయత్నతిస్తోందని.. కానీ తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని కేజ్రీవాల్ అంటున్నారు. కానీ కొంత మంది టచ్లో లేకుండా పోవడంతో కేజ్రీవాల్కూ టెన్షన్ తప్పడం లేదు. దేశంలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా.. ప్రభుత్వాలకు వణుకు తప్పడంలేదు. ఓట్లు కొనే ప్రజాస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతోంది.