చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. అందులో మొదటి రోజు ఘర్షణ పడ్డారు.రెండో రోజు బంద్కు పిలుపునిచ్చారు. కావాల్సినంత విధ్వంసం చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టారు. జరగాల్సింది జరిగింది. చంద్రబాబు కుప్పం దాటగానే.. టీడీపీ నేతలందర్నీ అరెస్ట్ చేయడం ప్రారంభించారు. కుప్పం ముఖ్య నేతలందరిపైనా కేసులు పెట్టేసి.. ఐదారు ప్రత్యేక బృందాలను పెట్టి అరెస్ట్ చేయడం ప్రారంభించారు. అదే నేరుగా దాడులు చేసిన వైసీపీ నేతలు ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వారిపైనాకేసులు లేవు.
టీడీపీ నేతలపై కేసులే టార్గెట్గా చంద్రబాబు పర్యటనలో ఘర్షణల వ్యూహం వైసీపీ అమలు చేసినట్లుగా భావిస్తున్నారు. అందర్నీ కేసుల్లో ఇరికించడం ద్వారా ఎన్నికల సమయంలో వారిని బైండోవర్ చేయడంతో పాటు..పార్టీలో తిరగకుండా చేయవచ్చని వైసీపీ వ్యూహం అంటున్నారు. నిజానికి టీడీపీ నేతలు దాడులు చేశారో లేదో.. అసలు అక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లుగా ముఖ్య నేతలందరిపైనా కేసులు పెట్టడం అనూహ్యంగా మారింది.
ఈ విషయాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో కానీ కుప్పం విషయంలో చంద్రబాబు సంప్రదాయ రాజకీయాలకు.. దాడులు.. దౌర్జన్యలు.. కేసులతో చెక్ పెట్టి గెలవడానికి వైసీపీ చేయాల్సినదంతా చేస్తుంది. టీడీపీ నేతలు తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని ఆవేశపడుతున్నారు కానీ అలాంటి సీన్ కోసం వైసీపీ ఎదురు చూస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.