ఏపీలో ప్రభుత్వం చేస్తున్న పర్యావరణ విధ్వంసం కళ్ల ముందే ఉంది. లేటరైట్ తవ్వకాలు.. అడవుల నరికివేత.. ఇలాంటివి మాత్రమే కాదు.. కళ్ల ముందు అందంగా కనిపించే రుషికొండను కూడా పిండి చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం నడుపుతున్న పాలకుడు.. విశాఖలో చెత్తను ప్రైవేటు స్వచ్చంద సంస్థ ఎత్తేస్తూంటే.. ప్రారంభించడానికి వెళ్లి చాలా పెద్ద డైలాగులు చెప్పారు. అందులో భాగంగా ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా చెప్పారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఎక్కడా జగన్ ప్రస్తావన తీసుకు రాకుండా..పూర్తి స్థాయిలో వ్యవహారం మొత్తం బట్టబయలయ్యేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
సిమెంట్, మైనింగ్, ఫార్మా, సిమెంట్ , రసాయన కంపెనీల కాలుష్యాన్ని బయటకు తీద్దామని … అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని హరిస్తున్న ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా వెలుగులోకి తెద్దామని ట్విట్టర్లో పిలుపునిచ్చారు. కాలుష్య కారక పారిశ్రామిక సంస్థల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన ప్రజాభిప్రాయసేకరమను.. ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి ఏకపక్షంగా నిర్వహిస్తోందని.. ఇలాంటి వాటిని కూడా వెల్లడించే సమయం వచ్చిందని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అ
పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ట్వీట్లు పర్యావరణం విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. ప్రధానంగా గత మూడేళ్లుగా ఏపీలో అనేక రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ అంశాన్నే టార్గెట్ చే్సతూ.. మైనింగ్, ఫార్మా , సిమెంట్ , రసాయన పరిశ్రమల కాలుష్యం గురించి బయటకు తేవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లుగా భావిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ కాలుష్యంపై అనేక ఆరోపణలు విపక్షాలు చేస్తూ ఉంటాయి. పవన్ కల్యాణ్ ట్వీట్లపై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో మరి !