అనంతపురం జిల్లాలో భానుప్రకాష్ అనే కానిస్టేబుల్‌ను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. దానికి కారణం ఏమిటంటే పోలీసులకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదని ప్లకార్డు పట్టుకోవడం. అలా పట్టుకున్నందుకు పోలీసు శాఖ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచింది. కానీ భయంతో అది పరోక్షంగానే నిలిచింది. చాలా విరాళాలు ఆయనకు వచ్చాయి. కానీ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయించింది. అయితే ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఆయనను సస్పెన్షన్ కాకుండా ఏకంగా డిస్మిస్ చేసేసింది. ఎందుకంటే.. ఆయన ఎప్పుడో.. ఫిర్యాదు చేయాడనికి వచ్చిన యువతిని ట్రాప్ చేశాడని.. అంతర్గత విచారణలో నిరూపితమయిందని.. అందుకే డిస్మిస్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు
ఇలాంటిదేమైనా ఉంటే కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేసి ఆధారాలుతో కోర్టు ముందు పెట్టి.. కోర్టు శిక్ష విధిస్తే అప్పుడు డిస్మిస్ చేస్తారు. కానీ తాము అంతర్గత విచారణ చేశామని చెప్పి ఏకంగా డిస్మిస్ చేసేశారు. ఇదంతా కక్ష పూరితమేనని అందరికీ అర్థమైపోతుంది అయితే ఆ కానిస్టేబుల్ భాను ప్రకాష్ ఇంతటితో ఆగదల్చుకోలేదు. ప్రభుత్వంపై పోరాటం చేయాలనుకుంటున్నారు. ఆయన దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్. ఇక ఇతర పార్టీలు ఊరుకుంటాయా. ? గోరంట్ల మాధవ్‌ను వైసీపీ ఎలా ఉపయోగిచుకుందో.. అలా ఉపయోగించుకోవడానికి ఇతర పార్టీలు రెడీ అయిపోయాయి.
ఇప్పుడు ఆ భాను ప్రకాష్.. పోలీసు వ్యవస్థలోని లోపాల గురంచి మాట్లాడుతున్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తీరును ప్రశ్నిస్తున్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? రూ.లక్షలు వసూలు చేసుకొంటున్న పోలీసులపై చర్యలు శూన్యం.. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని జరిగితే ఫకీరప్పే కారణం. నిరసన తెలుపుతూ ప్లకార్డు ప్రదర్శించినందుకే డిస్మిస్ చేశారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్రశ్నించడం తప్పా? అని భానుప్రకాష్ ప్రశ్నిస్తున్నారు. ముందు ముందుఈ భాను ప్రకాష్.. వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలకం నుంది. పోలీసులు కూడా అంతర్గతంగా ఆయనకు మద్దతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.