నటి అమలాపాల్ లైంగిక వేధింపులకు గురయ్యారు. మాజీ ప్రియుడు పవీందర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కేరళ పోలీసులను ఆశ్రయించారు. తామిద్దరం ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోల్నీ, వీడియోలను లీక్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ అమలాపాల్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. పవీందర్, అమలాపాల్ కొన్నాళ్లు ప్రేమలో ఉండి తరవాత విడిపోయారు. ఆ తరవాత దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొంది అమలాపాల్. కొంతకాలానికి ఇద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఇప్పుడు పాత ప్రేమికుడు మళ్లీ లైన్లోకి వచ్చి అమలాపాల్ ని బెదిరిస్తున్నాడు. తానే కాదు… మరో 11మందితో కూడా అమలాపాల్ కి కాల్ చేసి, ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అమలాపాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో కేరళ పోలీసులు… పవీందర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరో 11 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.