గల్వార్ అమరవీరులకు … సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో చనిపోయిన వలస కూలీల కుటుంబాకు సాయం అందించేందుకు కేసీఆర్ బీహార్ వెళ్లారు. అదే పని చేశారు. కానీ రాజకీయాల గురించి ప్రస్తావించలేదు కేంద్రం విధానాలను తప్పు పట్టలేదు. గల్వాన్ అమల వీరులకు పొగడ్తలు… వలస కూలీలకు ప్రశంసలు ఇచ్చారు. అదే సమయంలో కేసీఆర్ – నితీష్ ఒకరినొకరు అభినందించుకున్నారు.
కేసీఆర్ కన్నా నితీష్ కుమారే.. ఎక్కు వ పొగిడారు. కేసీఆర్ అద్భుతమైన పథకాలు ప్రవేస పెట్టిన సీఎం అన్నారు. కేసీఆర్ రాష్ట్ర విభజన కోసం పోరాడితెలంగాణ సాధించారన్నారు. మిషన్ భగీరథ పథకం.. సామాన్యమైన విషయం కాదన్నారు. తెలంగాణలో కేసీఆర్ను కాదనుకునేవారు ఎవరూ ఉండరన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాల పరిశీలనకు తమ బృందాన్ని పంపామన్నారు. కేసీఆర్ పథకాల స్ఫూర్తితో గంగా జలాలను ననాలుగు ప్రధాన స్థలాలకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి అద్భుతమన్నారు . కేసీఆర్ ఇలా ఎలా అభివృద్ధి చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యానించారు.
రాజకీయంగా ముఖ్యమంత్రులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే వారు విడిగా సమావేశమయ్యారు. ఈ సంద్భంగా జాతీయ రాజకీయాల అంశంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మోదీకి ప్రత్యామ్నాయం .. వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు అవకాశాలు.. మోదీని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనా చర్చలుజరిపినట్లుగా తెలుస్తోంది.