క్రేజ్, స్టార్ డమ్ ఉన్న ప్రతీ హీరోతోనూ సినిమా చేసిన నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు తన దృష్టి విజయ్ దేవరకొండపై పడింది. విజయ్ తో ఓ సినిమా చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ తదుపరి సినిమా కచ్చితంగా దిల్ రాజు బ్యానర్లోనే ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. అర్జున్ రెడ్డి తరవాత.. విజయ్ చేతిలో అడ్వాన్సులు పెట్టినవాళ్లలో… దిల్ రాజు కూడా ఉన్నాడు. అప్పటి నుంచీ.. ఈ బ్యానర్‌కి ఓ సినిమా బాకీ ఉండిపోయాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేశాడు. అందుకే విజయ్ కోసం అర్జెంటుగా కథలు రెడీ చేసే పనిలో దిల్ రాజు బిజీగా ఉన్నాడు. దిల్ రాజు కాంపౌండ్ లో చాలామంది దర్శకులు ఉన్నారు. వాళ్లందరితోనూ దిల్ రాజు భేటీ మొదలెట్టారు. ఎవరి దగ్గర విజయ్ కి సరిపడ కథ ఉంటే.. వాళ్లతో సినిమా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలెట్టారు. `లైగర్` తరవాత విజయ్ `ఖుషి` పూర్తి చేయాలి. ఈరోజు నుంచే ఖుషి కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వచ్చేవారంలో సమంత ఈ సెట్లో అడుగుపెట్టబోతోంది.