కుర్చీలు విరగొట్టవద్దు అని పవన్ కల్యాణ్ అభిమానులను సూపర్ హిట్ సినిమాల స్పెషల్ షోలను రిలీజ్ చేస్తున్న వారు బతిమాలుతున్నారు. ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేస్తున్న ఈ షోలలో ఫ్యాన్స్ భారీగా హంగామా చేస్తున్నారు. ధియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే కొంత మంది ఫ్యాన్స్ ఇదే సందనుకును కుర్చీలను విరగ్గొట్టడం..ధియేటర్ల ఆస్తులకు నష్టం కలిగించడం లాంటివి చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల ఇలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ ఏపీలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి.
దీంతో ఎస్కేఎన్, సాయిరాజేష్ లాంటి వాళ్లు ప్రత్యేకంగా పవన్ అభిమానులకు.. కుర్చీలు విరగ్గొట్టవద్దని.. అలా చేస్తే నష్టాలొస్తాయని చెబుతున్నారు. పవన్ సినిమాల ప్రత్యేక షోలు కేవలం చారిటీ కోసం ఏర్పాటు చేస్తున్నారని.. కుర్చీలు విరగ్గొడితే ఆ నష్టాన్ని కలెక్షన్ల నుంచి భరించాల్సి వస్తుందని.. అదే జరిగితే షోలు వేస్తున్నదానికి అర్థం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం కల్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
పవన్ ఇప్పుడు సినిమా హీరో మాత్రమే కాదు . రాజకీయ నేత కూడా . ఆయన అభిమానులు ఇలా వ్యవహరిస్తే చెడ్డపేరు పవన్‌కే వస్తుంది. ఫ్యాన్స్ అంతా ఇలా ఉంటే ఇమేజ్ దెబ్బతింటుంది. రాజకీయ ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుంటారు. గుంటూరు డి మార్ట్‌లో దోపిడికి పాల్పడ్డారంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. నిజానికి అలాంటిదేమీ జరగలేదు. కానీ ప్రచారం మాత్రం పీక్స్‌లో చేశారు. అందుకే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. దురదృష్టవశాత్తూ అలా ఉండటం లేదు.