ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి. అయితే రాజకీయ నాయకురాలే. అందుకే తనకు తెలంగాణలో కొన్ని బాధ్యతలిచ్చిన కారణంగా … ఆమె ఆ బాధ్యతలకు న్యాయం చేయడానికి గల్లీ రాజకీయ నాయకురాలి పాత్రలోకి వచ్చేశార. రెండు రోజుల నుంచి తెలంగాణలో పర్యటిస్తున్న ఆమె.. శుక్రవారం యాక్షన్‌లోకి దిగిపోయారు. ఓ రేషన్ షాపు దగ్గరకు వెళ్లారు. ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి కాబట్టి.. అధికార పర్యటన పేరుతో రాజకీయ పర్యటన చేస్తున్నా కలెక్టర్ కూడా ఆమె వెంట ఉన్నా
రు. మీడియా అటెన్షన్ కోసం ఇంత కంటే పెద్ద అవకాశం రాదనుకున్నారేమో కానీ.. కలెక్టర్‌పై సంబంధం లేని ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో రాష్ట్ర వాటా ఎంత.. కేంద్ర వాటా ఎంత అని కలెక్టర్ జితేష్ పాటిల్ ను నిలదీశారు. యూపీఎస్సీలో కూడా ఇలాంటి ప్రశ్న అడగలేదని ఆయన తికమక పడ్డారు. తెలీదని చెప్పారు. తెలంగాణలో అందిస్తున్న ఉచిత బియ్యం ఖర్చులో రూ. 29 కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 5 మాత్రమే కేటాయిస్తోంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
అంతలోనే కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీపై ప్రతి పైసా ఖర్చు చేస్తుంటే… రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవటం ఏమిటని నిలదీశారు. రేషన్ దుకాణాల్లో మోదీ ఫోటో కూడా ఉండాలని ఆయన కలెక్టర్ ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడూ ఊహించి ఉండరు. నిర్మలా సీతారామన్ అడిగిన దానికి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు.నిర్మలా సీతారామన్ వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రం నుంచి వెళ్తున్న పన్నులే తిరిగి ఇస్తున్నారని అందులోనూ తీసుకుంటున్నదే ఎక్కువ తిరిగి వస్తోంది తక్కుని అంటున్నారు. బీజేపీ నేతలు అతి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.