వైసీపీ అధినేత జగన్కు గెలుపు భయం పట్టుకుంది. తనపై అసంతృప్తి లేదని.. ఎమ్మెల్యేలు, ఎంపీల్లోనే ఉందని ఆయన నమ్ముతున్నారు. అందుకే అరవై డెభ్బై మందిని మార్చాలనుకుంటున్నారు. వారిలో కొంత మందికి టిక్కెట్లు ఇవ్వక తప్పదు. అందుకే ఇతర చోట్ల వారికి అవకాశం కల్పించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. గోరంట్ల మాధవ్ ఇక ఎంపీగా గెలవరని డిసైడై.. ఆయనను కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యేకు మొండి చేయి చూపించనున్నట్లుగా తెలుస్తోంది.
అంబటి రాంబాబు పలుకుబడి సత్తెనపల్లిలో మసకబారిపోవడంతో అవనిగడ్డకు పంపుతారని చెబుతున్నారు. అసలు అంబటికి అవనిగడ్డకు సంబంధం ఏమిటో వైసీపీ పెద్దలకే తెలియాలి. అవనిగడ్డకు రేపల్లె దగ్గరని లెక్కలేసుకోవాలేమో ? అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు జెల్లకొట్టనున్నారు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపాలనుకుంటున్నారు. మంగళగిరి కన్నా .. సత్తెనపల్లే బెటరని ఆళ్ల అనుకుంటున్నారు. ఇక బాపట్ల జిల్లాలో పరిస్థితి బాగోలేకపోవడంతో నందిగరం సురేష్ నుపక్కన పెట్టాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
మెజారిటీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను డిసెంబరుకల్లా పూర్తిచేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా పోటీ చేసే నియోజకవర్గాల ఊహించని విధంగా కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో.. వారికే తెలియని విధంగా సీట్ల కేటాయింపు ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు.