హీరోలు, ముఖ్యంగా కుర్ర హీరోలు డాన్స్ నెంబర్లపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ఆల్బమ్‌లో ఒక్క పాటైనా మంచి బీటున్న పాటుంటే బాగుంటుందనుకుంటారు. తమ డాన్సింగ్ టాలెంట్ మొత్తం ఆ పాటలో చూపించడానికి తహతహలాడుతుంటారు. మెగా హీరోలంతా డాన్సుల్లో ఆరి తేరిపోయిన వాళ్లే. ఉప్పెనతో… ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్‌లోని డాన్సింగ్ టాలెంట్ సరిగా చూసే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. ఉప్పెనలో డాన్సింగ్ నెంబర్లు లేవు. కొండ పొలెంలోనూ అంతే. ఇప్పుడు `రంగ రంగ వైభవంగా`లోనూ అలాంటి పాట పడలేదు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తన ఆల్బమ్ లో కచ్చితంగా ఊపున్న పాట ఒక్కటైనా ఉంటుంది. కానీ… `రంగ.. రంగ`లో అదీ కనిపించలేదు.
నిజానికి… సెకండాఫ్ లో దేవీ మార్కు ఉన్న ఓ పాట ఉందట. అందులో మంచి డాన్స్ మూమెంట్స్ వేయడానికి అవకాశం ఉందట. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం ‘ఆ పాటకు తగినట్టుగా డాన్స్ చేయలేను. ఆ పాట తీసేద్దాం’ అని చెప్పేసరికి… రికార్డింగ్ చేసిన పాటని పక్కన పెట్టేశార్ట. వైష్ణవ్ మంచి నటుడే. కానీ.. డాన్సుల్లో ఇంకా సాధన చేయాల్సివుంది. మెగా హీరో మంచి డాన్స్ నెంబర్‌కి స్టెప్పులు వేశాడంటే.. అంతా అటువైపు ఆసక్తిగా చూస్తారు. యావరేజ్ స్టెప్పులతో మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేరు. అందుకే… డాన్సుల్లో మరింత శిక్షణ తీసుకొన్న తరవాతే.. వెండి తెరపై అలాంటి ప్రయత్నాలు చేస్తానంటున్నాడు వైష్ణవ్. ఓ రకంగా ఇది మంచి నిర్ణయమే. వచ్చీ రాని స్టెప్పులతో ఏవో ప్రయత్నాలు చేసేదానికంటే, డాన్సుల్లో గ్రిప్పు వచ్చేకే.. స్టెప్పులు వేయడం మంచిది కదా..!